పుణ్యక్షేత్రం ధర్మస్థలలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సామూహిక అత్యాచారాలు, హత్యల కేసులో పెద్ద మలుపు తిరిగింది. ఇప్పటివరకు బాధితుల తరఫున మాట్లాడుతున్న ఫిర్యాదుదారుడినే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, అతడు చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని, వాస్తవాలకు విరుద్ధమని విచారణలో తేలింది. గత కొంతకాలంగా ముసుగు ధరించి మీడియా ముందు ఆరోపణలు చేస్తున్న ఈ వ్యక్తిని సిట్ విచారణకు పిలిపించింది. గంటల తరబడి సాగిన విచారణలో అతడు చెప్పిన మాటలకు సరైన ఆధారాలు లేవని, చెప్పిన కథనాలు వాస్తవాలతో సరిపోలలేదని అధికారులు గుర్తించారు.
తప్పుడు సమాచారం పంచి ప్రజలను తప్పుదారి పట్టించాడన్న ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సిట్ స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ధర్మస్థల కేసు కొత్త మలుపు తిరిగి, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Read More : ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్

One thought on “ధర్మస్థల కేసులో సంచలన మలుపు”
Comments are closed.