లక్నోపై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ – మెంటార్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు

kevin pietersen

విశాఖపట్టణం వేదికగా సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)పై థ్రిల్లింగ్ విజయం సాధించింది. యువ ఆటగాడు అశుతోష్ శర్మ (66 పరుగులు, 31 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ 200కి పైగా పరుగుల లక్ష్యాన్ని చేధించి ఘన విజయాన్ని అందుకుంది.

ఈ విజయం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) తన ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “శుభోదయం డీసీ ఫ్రెండ్స్! థ్రిల్లింగ్ మ్యాచ్ తర్వాత నిద్రలేచి వచ్చే అనుభవం అద్భుతం. ఇది నిజంగా సెలబ్రేట్ చేసుకునే మ్యాచ్. ఢిల్లీ జట్టు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. కానీ, మా గోల్‌ను చేరుకోవడానికి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మరింత మెరుగుపడాలి. దయచేసి మా ప్రయాణాన్ని ఆస్వాదించండి” అంటూ పీటర్సన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు ఈ విజయాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Read More : అశుతోష్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్ – ఒంటిచేత్తో ఢిల్లీకి అద్భుత విజయం

One thought on “లక్నోపై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ – మెంటార్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Comments are closed.