మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడపల గ్రామంలో రేషన్‌కార్డుల జాబితా గందరగోళానికి కారణమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జాబితాలో అనర్హుల పేర్లు ఉండగా, సర్వేలో నమోదు చేసుకున్న అర్హుల పేర్లు మిస్ కావడం గ్రామస్తులను నిరాశకు గురి చేసింది. సుమారు 300 నుంచి 400 మంది రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోగా, కేవలం 40 మంది పేర్లే జాబితాలో ఉండటంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అనర్హుల పేర్లు జాబితాలో ఉండటంతో పాటు ఉద్యోగస్తులు, తాత్కాలిక నివాసితుల పేర్లు ఉండడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు సర్వేలో నమోదు చేసుకున్నప్పటికీ, తమ పేర్లు జాబితాలో లేకపోవడం బాధ కలిగించిందని గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కమటం వెంకన్న ప్రభుత్వ అధికారుల తప్పిదాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, రేషన్‌కార్డులు, ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలను అర్హులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత కాలం నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనలు తప్పవని వారు హెచ్చరించారు.
రేషన్‌కార్డుల జాబితా గందరగోళం: నర్సింహులపేట గ్రామస్తుల ఆందోళన
Share This
