లయోలా కాలేజ్‌ ఉద్యోగాల మోసం..

హైదరాబాద్‌ నగరంలోని అల్వాల్‌లో ఉన్న ప్రైవేట్‌ లయోలా డిగ్రీ కాలేజ్ యాజమాన్యం విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. డిగ్రీ పూర్తి కాకముందే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి, ఒక్కో విద్యార్థి వద్ద రూ.10 లక్షల చొప్పున వసూలు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

వాట్సాప్‌ గ్రూపుల ద్వారా మెసేజ్‌లు పంపించి విశ్వాసం కలిగించిన కాలేజ్ నియామక అధికారి, చివరికి విద్యార్థులకు నకిలీ నియామక పత్రాలు అందించి మోసం చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజ్ వద్దకు వెళ్లి అసలు విషయాన్ని నిలదీసే ప్రయత్నం చేసిన విద్యార్థులపై యాజమాన్యం ఎత్తులు వేసి అక్రమ కేసులు పెట్టిందని వారు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో లయోలా కాలేజ్ ఎదుట విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తాము ఇచ్చిన డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వాలని, లేకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఘటనపై సంబంధిత శాఖలు స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Read More : ప్రభుత్వ జీతం తీసుకున్న టీచర్ – చివరికి వారిపై సస్పెన్షన్.

One thought on “లయోలా కాలేజ్‌ ఉద్యోగాల మోసం..

Comments are closed.