తమిళనాడు కోయంబత్తూరులో ఓ పాఠశాలలో దళిత విద్యార్థినిపై అమానవీయంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపుతోంది. పీరియడ్స్ వచ్చిన కారణంగా ఆ విద్యార్థినిని తరగతి గదిలో ప్రవేశించనీయకుండా బయట కుర్చీపై కూర్చోబెట్టి పరీక్ష రాయించారు.
ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపిన విద్యార్థిని, మరుసటి రోజు తల్లి పాఠశాలకు వెళ్లగా ఆమె కూతురు బహిరంగ ప్రదేశంలో పరీక్ష రాస్తుండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.
యాజమాన్య నిర్లక్ష్యం, వివక్షతకు నిరసనగా విద్యార్థిని తల్లి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి దర్యాప్తు ప్రారంభించాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
Read More : వరణాసిలో 19ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడి..

One thought on “తమిళనాడులో దళిత విద్యార్థినిపై అమానవీయ వ్యవహారం”
Comments are closed.