ఏపీ మాజీ సీఎం జగన్ పోలీసులపై తీవ్ర విమర్శలు..

ys jagan

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోసారి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలీసులను వాచ్‌మెన్ల కంటే ఘోరంగా వాడుకుంటోందని ఆరోపించారు. గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పోల్చితే ఈ వ్యాఖ్యలు మరింత దూకుడుగా ఉన్నాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని, హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఇప్పటికే రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ ఏ ఒక్క హామీ కూడా అమలవ్వలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలు ప్రజల ఎదుటకు వెళ్లే స్థితిలో లేరని, ప్రజల్లో నిరాశ పెరిగిపోతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఇదే పద్ధతిలో పాలన కొనసాగితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Read More : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

One thought on “ఏపీ మాజీ సీఎం జగన్ పోలీసులపై తీవ్ర విమర్శలు..

Comments are closed.