తెలుగు సీఎంలతో సీఆర్ పాటిల్ భేటీ

న్యూఢిల్లీలో బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ అజెండాగా ముందుకు తెచ్చింది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం మొత్తం 13 కీలక అంశాలను అజెండాలో చేర్చింది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.

ఈ సమావేశం రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి దోహదపడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Read More : తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు