ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ఢిల్లీలో ఘన స్వాగతం

ఎన్డీయే కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీ.పీ. రాధాకృష్ణన్ ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన పలువురు ముఖ్య నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను రాధాకృష్ణన్ రేపు దాఖలు చేసే అవకాశం ఉంది. సంఖ్యాబలం దృష్ట్యా ఈ ఎన్నికలలో ఆయన విజయం దాదాపు ఖాయమని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Read More : ఒడిశాలో భారీ బంగారు నిల్వలు కనుగొన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా

One thought on “ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ఢిల్లీలో ఘన స్వాగతం

Comments are closed.