అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ (Congress) మరియు బీఆర్‌ఎస్ (BRS) నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హరీష్ రావు వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై వివాదం
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, స్టేచర్ గురించి ముందుగా కేటీఆర్ మాట్లాడారని పేర్కొన్నారు. ‘‘సీఎం పదవి కంటే స్టేచర్ ఇంకేమైనా ఉంటుందా? సీఎం రాష్ట్రానికి పెద్దన్న లాంటి వారు’’ అని ఆయన అన్నారు. హరీష్ రావును ఉద్దేశించి ‘‘మీ నోరు అదుపులో పెట్టుకోండి. ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం’’ అంటూ హెచ్చరించారు.
హరీష్ రావుపై ఆగ్రహించిన బీర్ల ఐలయ్య
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, హరీష్ రావు ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యం, గవర్నర్, సీఎం అంటే బీఆర్‌ఎస్‌కు విలువ లేదని ప్రజలు గమనిస్తున్నారు. హరీష్ రావు తస్మాత్ జాగ్రత్త’’ అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలో మూడు లక్షల పిచ్చి కుక్కలు ఉన్నాయని, వాటి అధ్యక్షుడే రేవంత్ రెడ్డి’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం’’ అంటూ మండిపడ్డారు.
గంగుల కమలాకర్ డిమాండ్
మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ‘‘కేసీఆర్ పితృ సమానులు. ఆయనకు క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పక తప్పదు’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇలా కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది.

2 thoughts on “కాంగ్రెస్ vs బీఆర్‌ఎస్: తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం”
Comments are closed.