ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా — నేషనల్ హెరాల్డ్ అంశంపై ప్రదర్శనల ఉధృతి

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ధర్నాకు దిగారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అందుబాటులో లేని నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా నేడు కాకుండా రేపు అధికారికంగా నిరసనలు చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, కేంద్ర సంస్థల వేధింపులను వ్యతిరేకిస్తూ వ్యక్తిగతంగా ముందడుగు వేసిన సీనియర్ నేత వీహెచ్ ఈడీ కార్యాలయం ముందు ధర్నాకు బైఠాయించారు.

పార్టీ ఆదేశాల మేరకు తన బాధ్యతగా ఈ నిరసన చేపట్టినట్టు ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పిలుపుతో దేశవ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ కేసు ప్రస్తావిస్తూ ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ ర్యాలీలు, ధర్నాలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి.

Read More : నందికొండలో హృదయ విదారక ఘటన..

One thought on “ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా — నేషనల్ హెరాల్డ్ అంశంపై ప్రదర్శనల ఉధృతి

Comments are closed.