దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ.33.50 మేర తగ్గించాయి. దీంతో తగ్గిన ధరలతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ కొత్త రేటు రూ.1,631.50గా నిర్ణయించారు.
సిలిండర్ ధరల తగ్గింపుతో రెస్టారెంట్లు, హోటళ్లు, కమర్షియల్ వంటశాలలకు కొంత ఉపశమనం లభించనుంది. ప్రతి నెలా ధరలను సమీక్షించే ఆయిల్ కంపెనీలు ఈసారి గ్యాస్ ధరల్లో స్వల్ప సవరణ చేశాయి. అయితే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని అధికారులు తెలిపారు.
Read More : రూ.17 వేల కోట్ల రుణ మోసం కేసు

One thought on “కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్లో స్వల్ప తగ్గింపు”
Comments are closed.