రూ.17 వేల కోట్ల రుణ మోసం కేసు

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెద్ద షాక్ ఇచ్చింది. రూ.17 వేల కోట్ల రుణ మోసానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఈడీ, అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఇక జులై 24న అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలు, 25 మంది వ్యాపార భాగస్వాముల ఇళ్లు, అలాగే అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లకు సంబంధించిన 35కు పైగా కార్యాలయాల్లో ఈడీ ఆకస్మిక సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్‌ (పీఎంఎల్ఏ) కింద మూడు రోజుల పాటు సాగిన ఈ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read More : ఎన్డీయేకు షాక్ ఇచ్చిన పన్నీర్ సెల్వం.. ఆసక్తికరంగా తమిళ రాజకీయాలు

One thought on “రూ.17 వేల కోట్ల రుణ మోసం కేసు

Comments are closed.