మహారాష్ట్ర అసెంబ్లీలో మొబైల్‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన వ్యవసాయశాఖ మంత్రి మాణిక్‌రావ్ కోకటేపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కఠిన చర్యలు తీసుకున్నారు. మాణిక్‌రావ్‌ను వ్యవసాయశాఖ నుంచి తప్పించి క్రీడాశాఖకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మరియు NCP (అజిత్ వర్గం) నాయకుడు అజిత్ పవార్‌తో చర్చించిన తర్వాత ఫడ్నవీస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
అసెంబ్లీలో రైతుల సమస్యలపై చర్చ జరుగుతుండగా, మంత్రి మాణిక్‌రావ్ మొబైల్‌లో రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతులు అప్పుల భారం, సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మంత్రి ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపిస్తోందని విమర్శించాయి.
వివాదం ఊపందుకోవడంతో మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్ తక్షణమే చర్యలు తీసుకుని మాణిక్‌రావ్‌ను వ్యవసాయశాఖ బాధ్యతల నుంచి తప్పించి, కొత్తగా క్రీడాశాఖను అప్పగించారు.
Read More : కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్లో స్వల్ప తగ్గింపు

One thought on “అసెంబ్లీలో రమ్మీ వివాదం”
Comments are closed.