CM చంద్రబాబు: తమాషాలొద్దు… పద్దతి మార్చుకోండి..
తిరుపతి, జనవరి 9: తిరుపతి బైరాగిపట్టెడలో జరిగిన తొక్కిసలాట ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. రేణిగుంట ఎయిర్పోర్టు నుండి అక్కడికి చేరుకున్న ఆయన, కలెక్టర్, ఎస్పీ, టీటీడీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధులు కేటాయించిన పోలీసు అధికారికి జాగ్రత్తలు చెప్పకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. “ఇది క్షమించాల్సిన తప్పు కాదని”, “టికెట్ల పంపిణీ కేంద్రంలో తొక్కిసలాటలను నియంత్రించడానికి ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు?” అని అధికారులను ప్రశ్నించారు.
భక్తుల రద్దీ పెరిగిపోతుండగా, అధికారుల చర్యలు ఏంటి? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, పద్ధతిగా పనిచేయాలని హెచ్చరించారు.
“ఈ కేంద్రం వద్ద ఫెయిల్యూర్ ఎందుకు జరిగింది? మీరు సమాధానం చెప్పాలి. ఇక్కడ నియమించిన పోలీసు అధికారి జాగ్రత్తలు చెప్పారా?” అంటూ చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.
“భక్తులను లోపలికి పంపించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పద్ధతిగా పని చేయండి. అక్కడ జరిగిన తప్పుడు చర్యల కోసం క్షమించాలి అని కాదు. బాధ్యత తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి” అంటూ ఆయన స్పష్టంగా చెప్పారు.
