చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల జరిమానాతో పాటు రెండు పూచీకత్తులు సమర్పించాలని నిబంధనలు విధించింది.
గత ఫిబ్రవరి 8న రంగరాజన్ ఇంటికి వెళ్లిన వీరరాఘవ రెడ్డి, తాను “రామరాజ్యం కోసం సైన్యం సిద్ధం చేస్తున్నా”ని పేర్కొంటూ మద్దతు కోరాడు. అనంతరం అతని అనుచరులతో కలిసి రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడం కేసులో కీలక మలుపుగా మారింది.
Read More : హైదరాబాద్‌లో మజ్లిస్ కోటల పైన బీజేపీ జెండా ఎగరబోతోంది: కిషన్ రెడ్డి…

One thought on “ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డికి బెయిల్..”
Comments are closed.