భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న ఆయన నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు “జ్ఞానేశ్ కుమార్ బీజేపీ నేత”, “ఓటు చోర్” అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఈ నిరసన కార్యక్రమం జరగడం గమనార్హం.
Read More : ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు

One thought on “యూపీలో సీఎస్‌ఈ ఇంటి వద్ద కాంగ్రెస్ ఆందోళన”
Comments are closed.