కమిటీల ఏర్పాటు, అపోహలకు తెరదించనున్న CM

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో స్వర్ణాంధ్ర పీ–4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం శుక్రవారం జూమ్ వేదికగా జరిగింది. ఈ సందర్భంగా పీ–4 లోగోను ఆయన ఖరారు చేశారు. పథకం అమలు మరింత సమర్థవంతంగా జరగాలని పేర్కొంటూ, ముఖ్యమంత్రి రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పీ–4 పథకం పర్యవేక్షణకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో చాప్టర్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కమిటీల్లో ఇన్‌ఛార్జి మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సభ్యులుగా ఉండనున్నట్లు తెలిపారు.

పీ–4 అమలులో బాపట్ల జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని సీఎం ప్రకటించారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను, లక్ష మంది మార్గదర్శులను గుర్తించాలనే లక్ష్యాన్ని సీఎం ముందుపెట్టారు.

పీ–4 పథకం అమలుపై ప్రజల్లోని అనుమానాలను కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకురాగా, చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఈ పథకం వల్ల ఏ సంక్షేమ పథకానికి కోత ఉండదని, పీ–4 పూర్తిగా సంక్షేమానికి తోడ్పాటుగానే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల్లోని అపోహలు తొలగించేందుకు నేతలు, అధికారులు చురుకుగా పని చేయాలని సూచించారు. మార్గదర్శులు బంగారు కుటుంబాలకు సరైన సమయంలో మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని అన్నారు.

Read More : రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

One thought on “కమిటీల ఏర్పాటు, అపోహలకు తెరదించనున్న CM

Comments are closed.