అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14,705 స్వయం సహాయక సంఘాలకు రూ.1,826.43 కోట్లు రుణాలను పంపిణీ చేశారు. స్త్రీ నిధి రుణాల కోసం రూ.1,000 కోట్ల చెక్‌ను అందజేశారు.
అంతేకాకుండా, 100 మంది మహిళల విజయ గాధల పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన ‘శక్తి యాప్’ ను ప్రారంభించారు.
ప్రముఖంగా, చేనేత రథం, ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని సీఎం ప్రారంభించారు. మహిళలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించి, వారి కృషిని అభినందించారు.

2 thoughts on “మహిళా దినోత్సవం: స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు”
Comments are closed.