భాష అనేది కేవలం కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే సాధనమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పేర్కొన్నారు. భాషలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, విద్యా వ్యవస్థలో భిన్న భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.
రాష్ట్రంలోని ప్రతి విశ్వవిద్యాలయంలో 5 నుండి 10 భాషలను, అంతర్జాతీయ భాషలతో కలిపి, ప్రోత్సహించే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భాషా నేర్చుకోవడం అనేది వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, ఇతర ప్రాంతాల ప్రజలతో అనుసంధానానికి దోహదపడుతుందన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “హిందీ నేర్చుకోవడం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో సులభంగా కమ్యూనికేట్ అవ్వవచ్చు. భాషలు మనం ఇతరులతో మమేకం కావడానికి, బంధాలను బలపరచడానికి సహాయపడతాయి” అని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులకు మరింత విస్తృత స్థాయిలో భాషా విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

One thought on “భాష అనేది కేవలం కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే సాధనం: సీఎం చంద్రబాబు”
Comments are closed.