అమరావతిలో సీఎం చంద్రబాబు నివాసానికి శంకుస్థాపన..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు నివాస నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు భూమిపూజలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణీ, కుమారుడు దేవాంశ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సంప్రదాయ పద్దతిలో శ్రీవైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా శంకుస్థాపన నిర్వహించారు.

వెలగపూడిలో సీఎం నివాస నిర్మాణానికి భూమిపూజ జరగడం రాష్ట్ర రాజధాని అభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు.

Read More : అమరావతిలో సీఎం చంద్రబాబు సొంతిల్లు నిర్మాణానికి శంకుస్థాపన సిద్ధం..

One thought on “అమరావతిలో సీఎం చంద్రబాబు నివాసానికి శంకుస్థాపన..

Comments are closed.