కేంద్రం భారీ వరద సహాయ నిధులు విడుదల – ఐదు రాష్ట్రాలకు భారీ మంజూరు

Flood

కేంద్రం భారీ వరద సహాయ నిధులు విడుదల

దేశంలో విపత్తులు, వరదల సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు భారీ మొత్తంలో నిధులు విడుదల చేసింది. 2024లో వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి పరిస్థితుల వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద అదనంగా రూ. 1,554.99 కోట్లను మంజూరు చేసింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు ఈ నిధులు విడుదలయ్యాయి. అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ. 608.08 కోట్లు కేటాయించగా, తెలంగాణకు రూ. 231.75 కోట్లు మంజూరయ్యాయి. నాగాలాండ్‌కు రూ. 170.99 కోట్లు, ఒడిశాకు రూ. 255.24 కోట్లు, త్రిపురకు రూ. 288.93 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిధుల మంజూరుకు ఆమోదం లభించింది. గత ఏడాది వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్ర బృందాలు పరిశీలన చేసి నివేదికలు సమర్పించాయి. ఆ నివేదికల ఆధారంగా కేంద్రం ఈ అదనపు నిధులను విడుదల చేసింది.

ఇప్పటికే 2024లో సహాయ నిధుల కింద కొన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ, తాజా పరిస్థితుల దృష్ట్యా మరింత సాయం అందజేయడం జరిగింది.

Read More

2 thoughts on “కేంద్రం భారీ వరద సహాయ నిధులు విడుదల – ఐదు రాష్ట్రాలకు భారీ మంజూరు

Comments are closed.