బుమ్రా .. ఎలాగైనా తిరిగొస్తాడు!

ముంబయి ఇండియన్స్‌కు షాక్ ఇచ్చేలా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. ESPNcricinfo నివేదిక ప్రకారం, బుమ్రా నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో పాటు సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌ను కూడా మిస్ అవుతాడు.

అయితే, బుమ్రా ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుండటంతో త్వరలోనే ఆయన మళ్లీ యాక్షన్‌లోకి రానున్నారని సమాచారం. ఫిట్‌గా ప్రకటించబడిన తర్వాత ముంబయి జట్టుతో చేరే అవకాశం ఉంది. బుమ్రా మళ్లీ జట్టులోకి వస్తే ముంబయి ఇండియన్స్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ మరింత బలపడనుంది.

ముంబయి బౌలింగ్ యూనిట్ ఇప్పటికే ఆందోళనకర స్థితిలో ఉండగా, బుమ్రా లాంటి కీలక బౌలర్ రీ ఎంట్రీతో వారు విజయం వైపు బలంగా పయనించే అవకాశం ఉంది.

Read More : అది మన స్టైల్‌ కాదు – వెంకటేశ్ అయ్యర్