అమర్‌నాథ్ యాత్ర భద్రతకు వెళ్తున్న BSF జవాన్‌లకు?

భద్రతా బాధ్యతల కోసం అమరనాథ్ యాత్రకు వెళ్లే BSF జవాన్‌లకు రైల్వే శాఖ అపమానం ఎదురైంది. అమర్‌నాథ్ యాత్ర భద్రత కోసం 1,200 మంది BSF జవాన్‌లు ఉదయపూర్ నుంచి జమ్మూ వెళ్ళాల్సి ఉండగా, రైల్వే శాఖ అందించిన రైలు స్థితి చాలా దయనీయంగా ఉండటంతో జవాన్‌లు ఆ రైలులో ప్రయాణించేందుకు తిరస్కరించారు.

అత్యంత పాతదైన, స్క్రాప్ తరహాలో ఉన్న ఈ రైలు చూడగానే జవాన్‌లు అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణ భద్రతకు విరుద్ధంగా ఉండటంతో రైలులోకి అడుగుపెట్టేందుకు నిరాకరించారు. ఈ విషయం గమనించిన అధికారులు వెంటనే స్పందించి మరో కొత్త రైలును ఏర్పాటు చేసి జవాన్‌ల ప్రయాణాన్ని సురక్షితంగా నిర్వహించారు.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రైల్వే శాఖ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది. భద్రత కోసం వెళ్తున్న జవాన్‌లకు ఇలాంటి అవమానం ఎదురుకావడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది.

Read More : హనీమూన్ హత్య కేసులో కొత్త మలుపు

One thought on “అమర్‌నాథ్ యాత్ర భద్రతకు వెళ్తున్న BSF జవాన్‌లకు?

Comments are closed.