బీఆర్ఎస్ పార్టీలో మరోసారి రాజకీయ దుమారం రేగింది. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇవాళ (మంగళవారం) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదలైంది.
హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత ప్రవర్తన పార్టీ శ్రేయస్సుకు విరుద్ధంగా ఉందని హైకమాండ్ తేల్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆమె పాల్గొన్నట్లు ఆరోపిస్తూ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే, కవిత సస్పెన్షన్ అనంతరం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ మరోసారి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సంజయ్, మాజీ ఎంపీ వినోద్ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ తీసుకునే తదుపరి చర్యలపై చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ భేటీ అనంతరం బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కవిత సస్పెన్షన్‌పై వారి అధికారిక స్పందన కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Read More
: రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించిన పేర్ని నాని.
One thought on “కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ?”
Comments are closed.