కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS MLC కవిత ఘాటు విమర్శలు

BRS kavitha

కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS MLC కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం PPP Mode లో నడుస్తోందంటూ విమర్శలు గుప్పించారు. PPP అంటే Phobia, Politics, Percentage అంటూ వ్యాఖ్యానించారు కవిత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి KCR Phobia పట్టుకుందని, Mic పట్టగానే KCR ను తిట్టడం మించి ఇంకో ఆలోచన రేవంత్‌కు రాదని ఎద్దేవా చేశారు.

ప్రజా సమస్యలు, రైతుల కష్టాలు వదిలేసి ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్ వెళ్లారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని “10 పర్సెంట్ సర్కార్” అని ప్రజలు పిలుస్తున్నారని చెప్పారు. Percentage ఇస్తేనే పనులు జరుగుతున్నాయంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా పాలన సరిగా సాగడం లేదని, మహిళలకు ₹2500 పథకం ఇవ్వకపోయినా ఇచ్చామని ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు. PR Stunts మాత్రమే చేస్తున్నారంటూ ఆరోపించారు.

ఉచిత బస్సు ప్రయాణం మంచి నిర్ణయమే అయినా, మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా కాకుండా అమలు చేయాలని సూచించారు. బస్సుల సంఖ్య పెంచితే మహిళలతో పాటు అందరికీ సీట్లు దొరికే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. BRS ప్రభుత్వం ప్రారంభించిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, పరిపాలనపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి పెట్టడం లేదని కవిత ఆరోపించారు. మిర్చి రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇదే పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎలాంటి చొరవ తీసుకోవడం లేదని విమర్శించారు.

SLBC సొరంగం కూలిపోయినా సీఎం రేవంత్ రెడ్డి దాన్ని సందర్శించలేదని, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి మాత్రం వెళ్లారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ పూర్తిగా అమలుకాలేదని, రైతు భరోసా ఇంకా చాలా మందికి అందలేదని అన్నారు. రైతులను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మిర్చి రైతులకు క్వింటాల్‌కు ₹25,000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వరద సహాయం ఇప్పటికీ అందలేదని, వరద బాధితులకు ఇళ్లు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. వరదలు వచ్చినా, ప్రజలు కష్టాల్లో ఉన్నా, సమస్యలు వచ్చినా BRS పార్టీ మాత్రమే ప్రజల వెంటే ఉంటుంది అని తెలిపారు. KCR హయాంలో మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి చెందిందని, కేసీఆర్ హయాంలో మంజూరైన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని కవిత డిమాండ్ చేశారు.

Read More

One thought on “కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS MLC కవిత ఘాటు విమర్శలు

Comments are closed.