ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇవాళ (మే 20, మంగళవారం) ఉదయం 11 గంటలకు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. సమావేశంలో మొత్తం 25 అంశాలపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
సీఐపీబీ (SIPB) 6వ సమావేశంలో ఆమోదించిన పలు కంపెనీల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ లెదర్ అండ్ ఫుట్‌వేర్ పాలసీ 4.0కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ పాలసీతో పాటు 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35 వేల మందికి ఉద్యోగావకాశాలు కలిగే అవకాశం ఉంది.
జూన్ 12 నాటికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో, గత సంవత్సరం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష చేసి, వాటిపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లేలా ప్రచారంపై చర్చించనున్నారు.
అలాగే పోలవరం–బనకచర్ల ప్రాజెక్ట్‌కు పాలనాపరమైన అనుమతుల విషయంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల బదిలీలపైనూ కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. పలు పరిశ్రమలకు భూమి కేటాయింపుల అంశంపైనా ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Read More : ఏపీ మద్యం కుంభకోణం కేసు

One thought on “ఏపీ కేబినెట్ భేటీకి శ్రీకారం”
Comments are closed.