బ్రిటన్ ఎఫ్-35బి జెట్ … రెక్కలు విడదీసి తరలింపు

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రిటన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-35బి స్టెల్త్ ఫైటర్ జెట్ అత్యవసర ల్యాండింగ్ చేయడం సంచలనంగా మారింది. జూన్ 14న ఈ ఘటన చోటుచేసుకోగా, సాంకేతిక లోపం వల్ల విమానాన్ని భద్రంగా దిగించారు. ఈ విమానం బ్రిటిష్ రాయల్ నేవీకి చెందినదిగా అధికారులు వెల్లడించారు. ఎఫ్-35బి జెట్‌కు మరమ్మతులు చేసేందుకు ప్రత్యేకంగా బ్రిటన్‌ నుంచి 40 మంది ఇంజినీర్ల బృందం భారత్‌కు రాగానే పనిచేశారు. అయితే, రెండు వారాల కృషి తర్వాత కూడా సమస్యను పరిష్కరించలేకపోవడంతో విమానాన్ని తిరిగి యూకేకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రక్షణ వర్గాల సమాచారం మేరకు, ఈ జెట్‌ను సీ-17 గ్లోబ్‌మాస్టర్ అనే భారీ రవాణా విమానంలో తరలించనున్నారు. కానీ ఎఫ్-35బి రెక్కల వెడల్పు 11 మీటర్లు కాగా, సీ-17 కార్గో విభాగం వెడల్పు కేవలం 4 మీటర్లకు పరిమితం కావడంతో, విమానాన్ని పూర్తిగా లోపల ఉంచడం సాధ్యపడలేదు. దీంతో రెక్కలను వేరు చేసి విడిభాగాలుగా మారుస్తున్నారు.

ఇది సాంకేతికంగా క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ, గతంలో అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఈ తరహా తరలింపులు జరిపిన అనుభవం ఉంది. త్వరలోనే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి విమానాన్ని స్వదేశానికి పంపనున్నట్టు అధికారులు తెలిపారు.

Read More : ఆధ్యాత్మిక బంధాలను చాటిన భారత్

One thought on “బ్రిటన్ ఎఫ్-35బి జెట్ … రెక్కలు విడదీసి తరలింపు

Comments are closed.