బిగ్‌బాస్ హౌస్‌లో ఆత్మహత్యాయత్నం

దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందుతున్న బిగ్‌బాస్ రియాలిటీ షోకు సంబంధించి షాకింగ్ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్న ఓ ప్రముఖ నటి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఎండమోల్ షైన్ ఇండియా ప్రాజెక్ట్ హెడ్ అభిషేక్ ముఖర్జీ వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించిన అభిషేక్ ముఖర్జీ, ఈ ఘటన సమయంలో షో బృందం ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని వివరించారు. ప్రేమ విఫలమైన బాధతో బాధపడుతున్న ఓ నటి, ఆ బాధను మరిచేందుకు బిగ్‌బాస్ షోలోకి వచ్చిందని చెప్పారు. అయితే, హౌస్‌లోని ఓ నటుడు ఫేమ్, ఓట్ల కోసమే ఆమెతో ప్రేమగా నటించాడని, అది నిజమైన ప్రేమ అని నమ్మిన నటి తీవ్రంగా మానసికంగా కుంగిపోయిందని వివరించారు. ఒక తెల్లవారుజామున ఆ నటి కత్తి తీసుకుని బాత్రూంలోకి వెళ్లడంతో షో టీం తక్షణమే అప్రమత్తమై ఆమెను రక్షించిందని తెలిపారు. అనంతరం ఆమెకు సుమారు వారం రోజుల పాటు మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించి, పరిస్థితి మెరుగైన తర్వాత హౌస్ నుంచి పంపించారని అభిషేక్ వివరించారు.

ఈ ఘటన ఏ భాషలో జరిగిన బిగ్‌బాస్ సీజన్‌లో జరిగిందనే విషయాన్ని లేదా ఆ నటి, నటుడి పేర్లను మాత్రం నైతిక కారణాలతో వెల్లడించలేదు. ఈ ఘటన బిగ్‌బాస్ షోలోని మానసిక ఒత్తిడికి సూచికగా మారింది. షో నిర్వహణ వెనక ఉన్న అసలు ఒత్తిడిని ఇప్పుడు అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Read More : మహారాష్ట్రలో పర్యాటక కొండపై ఘోర ప్రమాదం

One thought on “బిగ్‌బాస్ హౌస్‌లో ఆత్మహత్యాయత్నం

Comments are closed.