భీమవరంలో మద్యం మత్తులో యువతి హల్‌చల్.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో మద్యం మత్తులో ఓ యువతి హల్‌చల్ చేసింది. మద్యం సేవించి ఆమె రోడ్డుపై పడుకోవడం వల్ల రద్దీ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. భీమవరం–పాలకొల్లు ప్రధాన రహదారిలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో మద్యం మత్తులో ఉన్న యువతి రహదారిపైనే పడుకుంది. ఆ సమయంలో వెళ్తున్న వాహనాలకు అడ్డంగా మారింది. ప్రయాణికులు, వాహనదారులు ఆమెను ట్రాఫిక్‌కు అడ్డుకాదని చెప్పినా ఆమె ఏమాత్రం కదలలేదు.

దాదాపు 20 నిమిషాల పాటు ఆమె రోడ్డుపైనే ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చివరకు పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని ఆమెను పక్కకు తరలించారు. ఈ ఘటన స్థానికులను, ప్రయాణికులను తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది.

ఇప్పటివరకు ఆ యువతి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అన్న విషయాలు స్పష్టతకు రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై అధికారులు పూర్తిగా దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

Read More : మైలవరం చిన్నారి ఘటనపై DCM ఆగ్రహం