శ్రినగర్, అమృతసర్‌లో డ్రోన్ దాడులు.

భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. శుక్రవారం రాత్రి పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోని పలు ప్రాంతాలపై డ్రోన్లు, శతఘ్నులతో దాడులకు పాల్పడింది. అయితే భారత భద్రతా బలగాలు వెంటనే దీటుగా స్పందించాయి.

శనివారం వేకువజామున పంజాబ్‌లోని అమృతసర్‌ ప్రాంతంలోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో శత్రు డ్రోన్‌ ఒకటి కనిపించిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. వెంటనే స్పందించిన వైమానిక రక్షణ విభాగాలు ఆ డ్రోన్‌ను విజయవంతంగా కూల్చివేశాయి. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్నాయి.

ఇదే సమయంలో శ్రీనగర్ ఎయిర్ బేస్ వద్ద కూడా డ్రోన్లతో దాడి జరిగింది. కానీ అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండి, దాడిని సమర్థంగా తిప్పికొట్టాయి.శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న భద్రతా వ్యవస్థలు అత్యున్నత హెచ్చరికలలో ఉన్నాయి.

Read More : ఆపరేషన్ సింధూర్‌పై కేంద్రం కీలక అప్డేట్