బెంగళూరులో కొత్త క్రికెట్ స్టేడియం

కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో ఒక కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించాలని యోచిస్తోంది. నగరంలో ప్రస్తుతం ఉన్న చిన్నస్వామి స్టేడియం, పెద్ద మ్యాచ్‌లకు సరిపోవడం లేదని భావిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రతిపాదిత ఈ కొత్త స్టేడియం సుమారు 80,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో నిర్మించే అవకాశం ఉంది. ఇది పూర్తయితే, భారతదేశంలో రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా నిలుస్తుంది. నూతన స్టేడియం నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి. దీని ద్వారా బెంగళూరులో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించడానికి మెరుగైన మౌలిక సదుపాయాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

Read More : జో రూట్ vs సచిన్: 158 టెస్టుల తర్వాత గణాంకాల పోలిక