రాష్ట్రపతి ముర్ము జన్మదినం – మోదీ శుభాకాంక్షలు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ – “రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి పట్ల ఆమె చూపుతున్న అచంచలమైన నిబద్ధత అందరికీ బలాన్ని ఇస్తోంది” అని కొనియాడారు.

ముర్ము గారు పేద, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు చేసిన కృషి ఎంతో గొప్పదని ప్రశంసించారు. చివరగా ఆమెకు సంపూర్ణ ఆయురారోగ్యంతో కూడిన దీర్ఘాయుష్షు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.

Read More : ఇంగ్లీషు మాట్లాడేవారు సిగ్గుపడే పరిస్థితి రాబోతోంది

One thought on “రాష్ట్రపతి ముర్ము జన్మదినం – మోదీ శుభాకాంక్షలు

Comments are closed.