శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ – టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ!

Sri Leela Bollywood debut

రీసెంట్‌గా ‘రాబిన్‌హుడ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన శ్రీలీల, ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాతో శ్రీలీల బీటౌన్‌లో అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా, ఇది ‘ఆషికి 3’ సినిమానే కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక శ్రీలీల, కార్తీక్ ఆర్యన్‌ల మధ్య కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల సినిమా సెట్స్ నుండి లీకైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో బైక్‌పై ఇద్దరూ క్యూట్‌గా కనిపిస్తుండగా, యూనిట్ సభ్యులే వీరి జోడీ సినిమాకు హైలైట్ అవుతుందని చెబుతున్నారు. బాలీవుడ్ మీడియాలోనూ ఈ కాంబోపై హైప్ పెరిగింది.

ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ఖరారు కాలేదు. అయితే కార్తీక్ లుక్, సినిమా స్టైల్ చూసిన నెటిజన్లు దీన్ని ‘ఆషికి 3’గానే అభివర్ణిస్తున్నారు. కార్తీక్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో రఫ్ అండ్ రగ్డ్ లుక్‌లో కనిపిస్తుండగా, శ్రీలీల స్టైలిష్ అవతార్‌లో ఆకట్టుకుంటోంది. త్వరలోనే మూవీ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా విజయంతో శ్రీలీల టాలీవుడ్‌ను దాటి బాలీవుడ్‌లో సక్సెస్ సాధిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.

Read More

One thought on “శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ – టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ!

Comments are closed.