సాయి పల్లవి ఉగ్రదాడిపై ట్వీట్: నెటిజన్లు పాత వీడియోతో ట్రోలింగ్

Sai Pallavi Pahalgam attack tweet

సాయి పల్లవి ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ట్వీట్ చేసి ఆ దాడిలో కలిగిన నష్టం, బాధ, భయం తనకు వ్యక్తిగతంగా అనిపించిందని చెప్పారు. ఆమె ట్వీట్ లో, “అలాంటి అమానవీయ చర్యలు ఇప్పటికీ కొనసాగుతుండటం బాధాకరం” అని పేర్కొన్నారు. కుటుంబాల మీద జరిగే దాడులపై తన హృదయపూర్వక సంతాపం వ్యక్తం చేశారు.

ఈ ట్వీట్ తరువాత, నెటిజన్స్ ఆమె గత వ్యాఖ్యలతో పోల్చుతూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. సాయి పల్లవి గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు మళ్లీ షేర్ చేస్తూ నెటిజన్స్ మండిపడుతున్నారు.

సాయి పల్లవి గతంలో ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ట్వీట్ పై వివాదానికి దారితీయగా, నెటిజన్స్ ఆమె పై విమర్శలు గుప్పిస్తున్నారు. సాయి పల్లవి గతంలో కశ్మీర్ పండితులపై జరిగిన దాడిని గోవులపై జరుగుతున్న దాడులతో సమానంగా భావించిన పాత వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది, సాయి పల్లవి కి పెద్దగా ఇబ్బంది కలిగించే అంశంగా మారింది. ఇంతకుముందు ఆమె చేసిన వ్యాఖ్యలపై వివాదాలు వచ్చినప్పటికీ, ఈసారి ఆమె ట్వీట్ వల్ల మరోసారి విమర్శలు వచ్చాయి.

Read More



One thought on “సాయి పల్లవి ఉగ్రదాడిపై ట్వీట్: నెటిజన్లు పాత వీడియోతో ట్రోలింగ్

Comments are closed.