ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సారంగపాణి జాతకం’కి కొత్త విడుదల తేదీ ఖరారైంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కానుంది. అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ సినిమాను వేసవి సందర్బంగా కుటుంబంతో కలిసి చూసేలా తీర్చిదిద్దారని మేకర్స్ చెబుతున్నారు.
మొదట ఏప్రిల్ 18న విడుదల చేయాలని భావించిన చిత్ర బృందం, డిస్ట్రిబ్యూటర్ల సూచన మేరకు మరింత వాస్తవిక ప్రమోషన్ కొరకు విడుదల తేదీని వాయిదా వేసి 25కు మార్చింది. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ అవుతుందని ధీమాగా తెలిపారు. క్రిటికల్ అప్రిషియేషన్ తో పాటు కమర్షియల్ విజయం సాధించేలా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రూపా కొడువయూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, వీకే నరేష్, వైవా హర్ష, తణికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, శివన్నారాయణ వంటి ప్రముఖులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు ఇంద్రగంటి మళ్లీ తన మార్క్ చూపించబోతున్నారని టాక్.
వివేక్ సాగర్ అందించిన సంగీతానికి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. నాలుగు పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీని పీజీ విందా, ప్రొడక్షన్ డిజైన్‌ను రవీందర్ నిర్వహించారు. ఈ వేసవిలో థియేటర్లకు కుటుంబాలతో వెళ్లే ప్రేక్షకులకిది ఓ హార్ట్‌ఫుల్ ఎంటర్టైన్‌మెంట్‌గా నిలవబోతోంది.

One thought on ““సారంగపాణి జాతకం” కొత్త డేట్ ఫిక్స్: ఏప్రిల్ 25న థియేటర్స్‌లో సందడి!”
Comments are closed.