బాబిల్ ఖాన్ పై సాయి రాజేష్ ఫైర్: సోషల్ మీడియాలో హోరెత్తిన వివాదం!

Babil Khan controversy

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ఇటీవల విడుదల చేసిన ఓ వీడియోతో వివాదాస్పదంగా మారాడు. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో నకిలితనం ఎక్కువగా ఉందంటూ, కొన్ని పేర్లను ప్రస్తావిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అర్జున్, అనన్య, షనయా, అర్జిత్ సింగ్ వంటి వారు మాత్రమే నిజాయితీగా ఉన్నారని తెలిపాడు.

ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో బాబిల్ వీడియోను తొలగించేశాడు. అనంతరం ఆయన టీమ్ స్పందిస్తూ, అందరూ అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, అన్ని నటీనటుల నుంచి ఆయనకు ప్రేరణ లభించిందని వివరించారు. అయితే ఈ వివరణను చూసి టాలీవుడ్ దర్శకుడు సాయి రాజేష్ తీవ్రంగా స్పందించారు.

సోషల్ మీడియా ద్వారా స్పందించిన సాయి రాజేష్ – ‘‘మీరు నిజంగా సారీ చెప్పాలి, మేమంతా పిచ్చోళ్లం కాదు’’ అంటూ మండిపడ్డారు. ముందు వరకు బాబిల్‌ను సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, కానీ ఇప్పుడు నిష్క్రమించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

దీనిపై బాబిల్ ఖాన్ కూడా స్పందిస్తూ, ‘‘మీరు నా మనసు ముక్కలు చేశారు, ఈ పాత్ర కోసం రెండేళ్లు కష్టపడి ఇతర అవకాశాలు వదులుకున్నా’’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌ వైరల్ కావడంతో తరువాత ఇద్దరూ వాటిని తొలగించారు. బేబీ సినిమా హిందీ రీమేక్ కోసం బాబిల్‌ను హీరోగా ఎంపిక చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ వివాదం మరింత హైలైట్ అయింది.

Read More


One thought on “బాబిల్ ఖాన్ పై సాయి రాజేష్ ఫైర్: సోషల్ మీడియాలో హోరెత్తిన వివాదం!

Comments are closed.