లోకేష్ కనగరాజ్ అన్నపూర్ణ కాలేజ్‌లో స్పెషల్ క్లాస్: యాక్షన్ మాస్ట‌ర్ పాఠాలు

Lokesh Kanagaraj at Annapurna College

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన ప్రతిభతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. “ఖైదీ,” “విక్రమ్,” “మాస్టర్” వంటి సూపర్ హిట్ సినిమాలతో నటులు, ప్రేక్షకులను అబ్బురపరిచిన లోకేష్, ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో “కూలీ” సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీరికలేకపోయినప్పటికీ, లోకేష్ ఏప్రిల్ 4న అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా విద్యార్థులకు ప్రత్యేక క్లాస్ తీసుకోనున్నారు.

అక్కినేని నాగార్జున కుటుంబం ఆధ్వర్యంలో భారతీయ సినిమా అభివృద్ధికి తోడ్పడుతున్న అన్నపూర్ణ స్టూడియోస్, నూతన టెక్నాలజీలతో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తుంది. లోకేష్ కనగరాజ్ ఈ క్లాస్‌లో సినిమా తయారీ, యాక్షన్ ఎంటర్టైనర్స్ క్రియేషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ పై పాఠాలు చెప్పనున్నారు. యంగ్ జనరేషన్‌కు తన అనుభవాలను పంచుకోవడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు, సినిమా మీదున్న ఆసక్తిని మరింత పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

లోకేష్ కనగరాజ్ తరగతులకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన యాక్షన్ ఎంటర్టైనర్స్ దక్షిణ భారత కమర్షియల్ సినిమాను కొత్త కోణంలో ప్రవేశపెట్టినట్లు పరిశ్రమలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమం విద్యార్థులకు గొప్ప అవకాశమని భావిస్తున్నారు. లోకేష్ చూపించిన సృజనాత్మకత, పట్టుదల, పద్ధతులు వారికి పాఠంగా నిలిచేలా ఉంటాయని ఆశిస్తున్నారు.

Read More

One thought on “లోకేష్ కనగరాజ్ అన్నపూర్ణ కాలేజ్‌లో స్పెషల్ క్లాస్: యాక్షన్ మాస్ట‌ర్ పాఠాలు

Comments are closed.