టీవీ సీరియల్స్‌తో ప్రారంభమైన అవికా గోర్ సినీ ప్రయాణం వెండి తెరపై మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘చిన్నారి పెళ్లి కూతురు’లో ఆనందిగా, ‘ఉయ్యాల జంపాల’లో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ… కెరీర్ తొలి దశలోనే పలు అవకాశాలు అందుకున్నా, స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రాకపోవడం వల్ల, కాస్త వెనుకబడిపోయింది. ఈ మధ్య కాలంలో మళ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి ఫ్యాషన్ ప్రపంచంలో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా అవికా గోర్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. డార్క్ షేడ్ ఔట్ఫిట్లో మెరిసిపోయిన ఈ బ్యూటీ, డార్క్ లిప్‌స్టిక్‌తో గ్లామరస్ లుక్‌లో కనిపించింది. బోల్డ్‌గా స్కిన్ షో చేయకున్నా ఆమె స్టైల్, ఫోటో పోజులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఫొటోలకు నెటిజన్లు మంచి స్పందన చూపిస్తున్నారు. “ఇంత అందంగా ఉన్నా, ఈమెకు తగిన అవకాశాలు రాకపోవడం బాధాకరం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

అవికా గోర్ ప్రస్తుతం మిలింద్ చాంద్వానీతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తుండగా, ఆమె కెరీర్ విషయానికొస్తే… ఇటీవల ‘షణ్ముఖ్’ సినిమాతో తెలుగు తెరపై దర్శనమిచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మరో అవకాశం కోసం వెయిట్ చేస్తోంది. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ నటించిన అవికా, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తన క్రేజ్‌ను మళ్లీ పెంచుకునే ప్రయత్నంలో ఉంది. త్వరలో మరిన్ని అవకాశాలు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.


One thought on “ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ టాపిక్ అవుతున్న అవికా గోర్ కొత్త ఫోటోషూట్!”
Comments are closed.