హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన అవతార్: ఫైర్ అండ్ యాష్. ఏడాది డిసెంబర్ 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈసారి, గత రెండు భాగాల కంటే ఎక్కువ వ్యవధితో ఈ సినిమా రూపొందిందని కామెరూన్ స్వయంగా వెల్లడించారు.
హాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన అవతార్ సినిమాకు పేరు పెట్టింది తానేనని బాలీవుడ్ నటుడు గోవిందా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ సందర్భంలో అమెరికా వెళ్లినప్పుడు జేమ్స్ కామెరూన్‌ను కలిశానని, డిన్నర్ సందర్భంగా ‘అవతార్’ గురించి ఆయన తనతో చర్చించారని తెలిపారు. అప్పట్లో సినిమాకు తానే టైటిల్ సూచించానని గోవిందా అన్నారు.
ఇంతేకాదు, ఈ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట జేమ్స్ కామెరూన్ తనను సంప్రదించారని, 410 రోజుల షూటింగ్‌కు రూ. 18 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని చెప్పారు. అయితే షూటింగ్ మొత్తం శరీరానికి పెయింట్ వేసుకోవాల్సి రావడంతో, అది ఆరోగ్యానికి హానికరమని భావించి తాను ఆ అవకాశం వదులుకున్నానని గోవిందా తెలిపారు.
ఈ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, అవతార్: ఫైర్ అండ్ యాష్పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

One thought on “అవతార్’ టైటిల్ నా ఐడియా.. కానీ హీరోగా నటించలేకపోయా! – గోవిందా”
Comments are closed.