అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ‘అస్త్ర’ క్షిపణిని దేశ రక్షణ పరిశోధన సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగల ఈ క్షిపణిని సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానంతో ప్రయోగించి పరీక్షించారు. పరీక్ష విజయవంతంగా ముగియడంతో, ‘అస్త్ర’ క్షిపణి తన లక్ష్యాన్ని ఖచ్చితంగా వేటాడగలదని మరోసారి నిరూపితమైంది. ఇది భారత రక్షణ వ్యవస్థను మరింత బలపరిచే కీలకమైన పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దేశీయంగా అభివృద్ధి చేసిన అస్త్ర క్షిపణి భారత వాయుసేనకు గగనతల ఆధిపత్యం కల్పించేందుకు కీలక భూమిక పోషించనుంది.

Read More : మయన్మార్‌లో వైమానిక దాడి.. 23 మంది మృతి .