పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తుండగా, సెప్టెంబర్ 25న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ కార్యాచరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో దర్శకుడు సుజీత్ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘‘OGతో రికార్డులన్నీ దుల్ల కొడుతున్నాం… ఎవడొస్తాడో రండి!’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమాలు కూడా సెప్టెంబర్ నెలలో విడుదల కావడంతో, ఈ సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ హోరాహోరీగా ఉండనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
OG టీమ్ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్‌కి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో ఈ సినిమా దూసుకెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read More : సుహాస్ “ఓ భామ అయ్యో రామ” మూవీ రివ్యూ
