ఆస్ట్రేలియా అంతరిక్ష రంగానికి మైలురాయిగా భావించిన తొలి దేశీయ రాకెట్ ప్రయోగం విఫలమైంది. గిల్మౌర్ స్పేస్ టెక్నాలజీస్ సంస్థ అభివృద్ధి చేసిన 23 మీటర్ల పొడవైన ‘ఎరిస్’ రాకెట్‌ను బుధవారం ఉదయం ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లోని బోవెన్ పట్టణ సమీపంలోని స్పేస్‌పోర్ట్ నుంచి ప్రయోగించారు. అయితే, రాకెట్ ప్రయోగం మొదలైన కొద్ది సెకన్లలోనే నేలకూలిపోయింది.
చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లడానికే ఈ రాకెట్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. లాంచింగ్ టవర్ ఎత్తును దాటి కొద్దిగా పైకి ఎగిరిన రాకెట్, గాల్లోకి ఎగసేందుకు చేసిన ప్రయత్నాల్లో విఫలమైంది. తొలిసారిగా ఆస్ట్రేలియా తయారు చేసిన ఆర్బిటల్ లాంచ్ వెహికల్‌ను, ఆస్ట్రేలియా నేలమీద నుంచే ప్రయోగించడం విశేషం.
ఈ విఫల ప్రయోగ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శాస్త్రవేత్తలు కారణాలను విశ్లేషించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
Read More : అమెరికా ఆంక్షల కటకట్లో ఆరు భారతీయ కంపెనీలు
