రాబోయే ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఈసారి జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యారు.
జట్టులోని సభ్యులు:
- సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
- శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్)
- అభిషేక్ శర్మ
- తిలక్ వర్మ
- హార్దిక్ పాండ్య
- శివమ్ దూబే
- అక్షర్ పటేల్
- జితేశ్ శర్మ (వికెట్ కీపర్)
- జస్‌ప్రీత్ బుమ్రా
- అర్షదీప్ సింగ్
- వరుణ్ చక్రవర్తి
- కులదీప్ యాదవ్
- సంజు శాంసన్ (వికెట్ కీపర్)
- హర్షిత్ రాణా
- రింకు సింగ్
ఈ జట్టులో యువ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ప్రపంచ కప్ తర్వాత సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం, యువ ఆటగాళ్లను సానబెట్టడంపై సెలెక్షన్ కమిటీ దృష్టి సారించింది.

Read More : IND vs PAK మ్యాచ్ : యాడ్ రేట్లు రికార్డ్ స్థాయిలో

One thought on “ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన”
Comments are closed.