అల్లు అర్జున్‌ ఖాతాలో అరుదైన రికార్డ్

Arya 2 Re-release

ఈనెల 8న అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు ఘనంగా వేడుకలకు సిద్ధమవుతున్నారు. పాన్ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ, “పుష్ప 2″తో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాడు. హిందీ సినిమాలకు సైతం సాధ్యం కాని రూ.1000 కోట్ల వసూళ్లను పుష్ప 2 తక్కువ సమయంలోనే సాధించింది. ప్రస్తుతం బన్నీ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టకపోయినప్పటికీ, మరో అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

బన్నీ బర్త్‌డే సందర్భంగా ఆయన నటించిన సూపర్‌ హిట్‌ మూవీ “ఆర్య 2″ను రీ రిలీజ్ చేస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్‌ అగర్వాల్, నవదీప్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. 15 ఏళ్ల తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తున్న “ఆర్య 2” తెలుగు వర్షన్ రీ రిలీజ్ కోసం అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 35 ఎంఎం థియేటర్‌లో విడుదలకు ముందే కేవలం 2 నిమిషాల్లో అన్ని టికెట్లు అమ్ముడైపోవడం విశేషం. ఈ వేగం రీ రిలీజ్ సినిమాల్లో అరుదైన రికార్డ్‌గా నిలిచింది.

అల్లు అర్జున్ అభిమానులు “ఆర్య 2” రీ రిలీజ్ తో భారీ వసూళ్లను ఆశిస్తున్నారు. “పుష్ప 2″తో బన్నీ స్థాయి అమాంతం పెరిగిన నేపథ్యంలో, “ఆర్య 2” రీ రిలీజ్ భారీ విజయాన్ని సాధించి బన్నీ స్టార్‌డంను మరోసారి నిరూపిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ సెంటిమెంట్‌ మరొకసారి పనిచేస్తుందని ఆశిస్తున్నారు.

Read More