ప్రముఖ దర్శకుడు బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని అలియాస్ నవీన్ బాబు, అనుకోకుండా హీరోగా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు సాధించారు. 2008లో మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అష్టాచెమ్మా సినిమాతో హీరోగా తొలి అడుగు వేసిన నాని, పక్కింటి అబ్బాయి ఇమేజ్‌తో అందరి మనసులను దోచుకొని “నేచురల్ స్టార్”గా పేరు పొందాడు.
అయితే, వరుస విజయాలతో ముందుకు సాగుతున్న నాని కెరీర్ ఎనిమిదవ సినిమా తరువాత కష్టకాలంలోకి వెళ్లింది. ఎటో వెళ్లిపోయింది మనసు నుంచి జెండాపై కపిరాజు వరకూ వరుస పరాజయాలు ఎదుర్కొన్న నానికి, కెరీర్ ముగిసిందనే కామెంట్స్ వచ్చాయి. కానీ, నాని బెదరలేదు. కొత్త కధలు, వినూత్న పాత్రలపై దృష్టి పెట్టి, ఎవడే సుబ్రహ్మణ్యం మరియు భలే భలే మగాడివోయ్ చిత్రాలతో తిరిగి విజయాన్ని సాధించాడు.
జెర్సీ సినిమా నానిని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా తో, టైర్ 2 హీరోల జాబితాలో చేరిపోయాడు. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా మూవీ నానిని వంద కోట్ల క్లబ్‌లోకి చేర్చి మాస్ హీరోగా కొత్త స్థాయికి తీసుకెళ్లింది. క్లాస్ మరియు మాస్ సినిమాల్లో బ్యాలెన్స్ చేస్తూ, హీరోగా, నిర్మాతగా విజయవంతంగా కొనసాగుతున్న నాని, ఇతర హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ప్రస్తుతం నాని హిట్ 3 మరియు ది పారాడైజ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్టార్ కిడ్స్ తమ కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలో నానిని చూసి నేర్చుకోవాలని ఇండస్ట్రీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి హీరోగా, నిర్మాతగా విజయాలు అందుకున్న నాని, త్వరలో దర్శకుడిగా తన ప్రతిభను చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

One thought on “నాని నుంచి స్టార్ కిడ్స్ ఏమి నేర్చుకోవాలి?”
Comments are closed.