యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో, ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వార్నర్ గురించి మాట్లాడుతూ, “రేయ్ డేవిడ్, వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప డైలాగులు వేస్తావా, దొంగ ముం** కొడకా, నువ్వు మామూలోడివి కాదు రోయ్ వార్నరూ” అని సరదాగా మాట్లాడారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయి, వార్నర్ అభిమానుల నుంచి స్పందన వచ్చింది.
కొందరు ఈ వ్యాఖ్యలను హాస్యంగా తీసుకోగా, మరికొందరు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను అనుచితంగా భావించి ఆగ్రహం వ్యక్తం చేశారు. “స్టార్ క్రికెటర్‌ను ఇలా అవమానించడం కరెక్ట్ కాదు” అని వారు పోస్ట్‌లు పెట్టారు. అయితే, డేవిడ్ వార్నర్ ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోలేదని, దర్శకుడు వెంకీ కుడుముల తెలిపారు.
వార్నర్ క్రికెట్లో స్లెడ్జింగ్‌కు అలవాటు పడిన వ్యక్తి కావడంతో, ఆయన ఈ కామెంట్లను పెద్దగా పట్టించుకోలేదని వెంకీ వెల్లడించారు. “ఆయన ఒక పెద్దవారు సరదాగా మాట్లాడారు, నేను ఏం బాధపడటం లేదు” అని వార్నర్ అన్నారు.
అయితే, ఈ విషయంపై సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.
Enduku ayya pilichi mari avamanistharu??#RajendraPrasad #Robinhood pic.twitter.com/tZdmv5aw99
— maheverse (@maheverse) March 24, 2025

One thought on “రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై డేవిడ్ వార్నర్ స్పందన”
Comments are closed.