ఏపీలో ‘ఓట్ చోర్’ క్యాంపెయిన్: వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

విజయవాడ: బీజేపీ, ఎన్నికల సంఘానికి (ఈసీ) వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘ఓట్ చోర్ క్యాంపెయిన్’ను ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి గడపకూ తీసుకెళ్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రం, ఈసీపై తీవ్ర విమర్శలు చేశారు.

షర్మిల డిమాండ్ చేసిన అంశాలు:

  • “ఓట్ల దొంగ మోదీ తీరును, బీజేపీ కోసం అధికార దుర్వినియోగం చేసిన ఈసీ వైఖరిని ప్రజల్లో ఎండగడతాం.”
  • “ప్రజాస్వామ్యమే ఈసీకి ముఖ్యమని భావిస్తే, రాహుల్ గాంధీ లేవనెత్తిన సందేహాలకు సమాధానం చెప్పాలి.”
  • “నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారైంది? డిజిటల్ ఓటర్ జాబితాను ఎందుకు ఇవ్వడం లేదు? ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు?” అని ఆమె ఈసీని నిలదీశారు.
  • బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందా? అని ఆమె ప్రశ్నించారు.

ఈసీపై తీవ్ర విమర్శలు:

ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ అని, కానీ అది బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని షర్మిల మండిపడ్డారు. దొడ్డిదారిన గెలుపు కోసం ఈసీని బీజేపీ కలుషితం చేసిందని, ఆర్ఎస్‌ఎస్ లాంటి అనుబంధ సంస్థల జాబితాలో చేరిందని ఆమె విమర్శించారు. మోదీ ఓట్ల దొంగ కాబట్టే ఈ విషయాలపై మౌనంగా ఉన్నారని షర్మిల పేర్కొన్నారు.

Read More : బెట్టింగ్ యాప్స్ కేసులో రానా దగ్గుబాటి ఈడీ విచారణ పూర్తి

One thought on “ఏపీలో ‘ఓట్ చోర్’ క్యాంపెయిన్: వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

Comments are closed.