నేషనల్ క్రష్‌కి నైట్ షిఫ్ట్‌– హారర్ మూవీ ‘తామా’లో కొత్త షేడ్

Rashmika Mandanna horror movie Tama

నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా ఈసారి కొత్త తరహా ప్రయోగానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్‌లో ‘ఛావా’ సినిమా విజయవంతం కావడంతో గట్టి ఊపు మీదున్న రష్మిక, ఇప్పుడు ‘తామా’ అనే హారర్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్రానికి సంబంధించి మొదటి లుక్ విడుదల కాకపోయినా, ఆమె పాత్రపై మేకర్స్ మంచి నమ్మకంతో ఉన్నారు. ‘స్త్రీ’, ‘ముంజ్యా’ వంటి హిట్ హారర్ సినిమాలు రూపొందించిన మ్యాడాక్ ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడమే కాకుండా, జియో స్టూడియోస్ భాగస్వామిగా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ‘తామా’ సినిమా నైట్ షెడ్యూల్‌లో షూటింగ్ జరుగుతోందని వెల్లడించింది. “ఇప్పుడు రెండు రోజులు చంద్రుడిని, కెమెరా లైట్స్‌ను, ఆకాశంలో నక్షత్రాలనే మాత్రమే షేర్ చేస్తా” అంటూ ఫన్నీగా రాసిన ఆమె పోస్ట్ వైరల్ అయింది. చంద్రుడు, చెట్లు, నైట్ విజువల్స్‌తో కూడిన ఆమె షేర్ చేసిన ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దర్శకుడు ఆదిత్య సర్పొడార్, నటుడు ఆయుష్మాన్ ఖురానా, నిర్మాత అమర్ కౌశిక్‌లను కూడా ఆమె ఈ పోస్ట్‌లో ట్యాగ్ చేయడం విశేషం.

‘తామా’ సినిమాను 2025 దివాళీకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ హారర్‌తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్‌ జోడించి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక పాత్ర మానసిక ఒత్తిడి, భయం, ఆత్మవిశ్వాసంతో కూడిన మల్టీ లేయర్డ్ క్యారెక్టర్‌గా ఉండనుందని సమాచారం. గతంలో ‘సికందర్’ నిరాశ కలిగించినా, ‘ఛావా’లో తన పాత్రతో మెప్పించిన రష్మిక, ఇప్పుడు ‘తామా’తో బాలీవుడ్‌లో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. హారర్ జానర్‌కి కొత్త వేపు చూపించే ఈ సినిమా, ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలవొచ్చని అంచనాలు ఉన్నాయి.

Read More

One thought on “నేషనల్ క్రష్‌కి నైట్ షిఫ్ట్‌– హారర్ మూవీ ‘తామా’లో కొత్త షేడ్

Comments are closed.