ఏపీలో 432 బార్ లైసెన్సుల రీ-నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 432 బార్ లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ మరోసారి రీ-నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 428 ఓపెన్‌ బార్లు, 4 రిజర్వ్ బార్ల లైసెన్సులు ఉన్నాయి. నూతన బార్ పాలసీ 2025–28 ప్రకారం డ్రా ఆఫ్ లాట్స్ విధానంలో లైసెన్సులు మంజూరు చేయనున్నారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 924 బార్లకు (840 ఓపెన్‌, 84 రిజర్వ్‌) లైసెన్సుల కోసం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో 492 బార్లకే (412 ఓపెన్‌, 80 రిజర్వ్‌) లైసెన్సులు ఖరారయ్యాయి. మిగిలిన బార్లకు నాలుగుకంటే తక్కువ దరఖాస్తులు రావడంతో లాటరీ జరగలేదు.

ఈ నేపథ్యంలో మిగిలిన బార్లను భర్తీ చేసేందుకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం 15వ తేదీ ఉదయం జిల్లా కలెక్టరేట్‌లలో లాటరీ నిర్వహించి లైసెన్సుదారులను ఎంపిక చేస్తారని అధికారులు తెలిపారు.

Read More : ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా సీఎం ప్రయత్నం.

One thought on “ఏపీలో 432 బార్ లైసెన్సుల రీ-నోటిఫికేషన్

Comments are closed.