ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను సినీ నిర్మాతల బృందం కలవనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లిలోని మంత్రి కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది.
ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, బన్నీ వాస్, దానయ్య, నాగవంశీ, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ పాల్గొననున్నారు. రాష్ట్రంలో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ల ధరలు, థియేటర్ల నిర్వహణ, ప్రభుత్వ సహకారం వంటి పలు అంశాలపై ఈ బృందం మంత్రికి వినతి పత్రం సమర్పించనుంది. కొత్త ప్రభుత్వంలో సినిమా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
Read More : ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ క్షమాపణలు

2 thoughts on “సినిమాటోగ్రఫీ మంత్రిని కలవనున్న నిర్మాతలు”
Comments are closed.